పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్ మూడో మ్యాచ్ చైనీస్ తైపీతో జరిగింది. ఒమన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 16-0 తేడాతో తైపీని ఓడించింది. ఈ విజయంతో ఇండియా ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. 3 విజయాలతో భారత్ 9 పాయింట్లు సాధించి పూల్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్‌లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎలక్ట్రిక్ కార్లే నడుస్తున్నాయి. అన్ని రకాల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేస్తున్నాయి. తక్కువ ధర నుంచి మొదలు పెడితే భారీ ధర వరకు ఎలక్ట్రిక్ కార్ల ఉన్నాయి. అందులో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు ఒకటి భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉండనుంది.
జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. దానిని నియంత్రించడం కోసం ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. జట్టు రాలడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. జుట్టులో రక్త ప్రసరణ లేకపోవడం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్. ఈ కారణాల వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారిపోయి.. జుట్టు రాలడం సమస్య పెరిగిపోతుంది. అయితే.. జుట్టు రాలకుండా ఉండేందుకు నిమ్మకాయ రసం అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడటం వల్ల జుట్టు ఊడటం కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మరసాన్ని ఆవనూనెలో కలిపి జుట్టుకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
గీజర్ పేలి నవ వధువు మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఐదు రోజుల క్రితమే పెళ్లి కాగా.. అత్తగారింటికి వచ్చిన యువతి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. దీంతో.. స్నానం చేసే క్రమంలో గీజర్ పేలి ఆ మహిళ మృతి చెందింది. అయితే.. గీజర్‌ను ఎక్కువగా చలికాలం వాడుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లతో స్నానానికి గీజర్ల వాడకం బాగా పెరిగింది. కాగా.. గీజర్‌ను ఉపయోగించే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో.. గీజర్‌ని ఉపయోగించేటప్పుడు కొన్ని…
అండర్-19 టెస్టులో సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన మెగా వేలంలో వైభవ్‌ను ఫ్రాంచైజీ రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, వన్డేలో ప్రపంచ మాజీ నంబర్ 1 బౌలర్ లోన్వాబో త్సోత్సోబే అరెస్టయ్యాడు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి అరెస్టయ్యారు. మ్యాచ్ జరుగుతుండగానే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 2015-16 రామ్‌స్లామ్ టీ-20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ క్రికెటర్లపై ఐదు అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.
ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వైభవ్.. అలీ రజా బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు.
హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ కారు పూర్తిగా కొత్త డిజైన్‌తో ముందుకు వస్తుంది.. దీనిని మినీ హోండా సిటీగా పిలుస్తున్నారు.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి.