చల్పాక ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ పై పలు అనుమానాలు ఉన్నాయని.. అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గండిపేట మండలం పీరంచెరువు పెబెల్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. ఈ క్రమంలో నిఖేశ్ కూమార్‌కు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా చల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది.. పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
అందరూ ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు. అయితే.. తినే దానిలో రుచి, ఆరోగ్యకరంగా లేకపోతే తినడం కష్టంగా ఉంటుంది. అయితే.. కొత్తగా బ్రేక్ ఫాస్ట్ చేసేవారికి పోషకాలతో కూడిన ఓట్స్ సూపర్ ఫుడ్.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శనివారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిద్దరినీ విచారిస్తున్నారు. సమాచారం ప్రకారం.. దిగువ ముండాలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా అటుగా వెళ్తుండటంతో.. అనుమానం వచ్చి వారిని ఆగమని భద్రతా బలగాలు చెప్పారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్‌లో జరిగింది.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 41-28 పాయింట్ల తేడాతో టైటాన్స్ ఘోర ఓటమిని చవిచూసింది.