Safety Tips: గీజర్‌ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
- చలికాలంలో గీజర్ల వాడకం ఎక్కువ
- గీజర్‌ను అజాగ్రత్తగా ఉపయోగిస్తే ప్రమాదం
- గీజర్‌ని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గీజర్ పేలి నవ వధువు మరణించిన ఘటన యూపీలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. ఐదు రోజుల క్రితమే పెళ్లి కాగా.. అత్తగారింటికి వచ్చిన యువతి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లింది. దీంతో.. స్నానం చేసే క్రమంలో గీజర్ పేలి ఆ మహిళ మృతి చెందింది. అయితే.. గీజర్‌ను ఎక్కువగా చలికాలం వాడుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లతో స్నానానికి గీజర్ల వాడకం బాగా పెరిగింది. కాగా.. గీజర్‌ను ఉపయోగించే క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలో.. గీజర్‌ని ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. గీజర్ వేడెక్కడం, పవర్ ప్రాబ్లం, గీజర్‌పై అధిక లోడ్ వల్ల.. గీజర్ ప్రమాదకరంగా మారనుంది. అలాంటప్పుడు గీజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని భద్రతా చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.
Dulquer Salmaan : అరుదైన ఘనత సాధించిన ‘లక్కీ భాస్కర్’
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
గీజర్‌ను బాత్రూంలో అమర్చడానికి సాంకేతిక నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఎందుకంటే గీజర్‌ను తప్పుగా ఇన్‌స్టాల్ చేయడం వల్ల గ్యాస్ లీక్‌లు లేదా ఇతర సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతో.. ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అలాగే.. సురక్షితమైన, సరైన స్థలంలో గీజర్‌ను పెట్టుకోవాలి. బాత్‌రూంలోని పై భాగంలో ఫిట్టింగ్ చేయించుకోవాలి. తక్కువ ఎత్తులో అమరిస్తే స్నానం చేసేటప్పుడు నీళ్లు ఆ గీజర్‌పై పడి పాడయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. గీజర్‌కు చేతులు తగిలినా ఊహించని ప్రమాదాలు జరగొచ్చు. అలాగే.. క్వాలిటీ ఉన్న గీజర్లనే వాడాలి.. క్వాలిటీ లేదంటే అవి పేలే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి, సర్టిఫైడ్ కంపెనీ నుంచే గీజర్‌లను కొనాలి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
గీజర్ వేడెక్కకుండా నిరోధించడానికి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి థర్మోస్టాట్‌ను 50°C, 60°C మధ్య ఉంచండి. ఎందుకంటే.. గీజర్ అధిక ఉష్ణోగ్రత తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతుంది. గీజర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు విద్యుత్ భద్రతను గుర్తుంచుకోండి. షార్ట్ సర్క్యూట్ లేదా విద్యుత్ షాక్‌ను నివారించడానికి సరైన ఎర్తింగ్‌తో కూడిన పవర్ అవుట్‌లెట్‌ను ఉపయోగించండి. గీజర్‌ని రోజంతా ఆన్‌లో ఉంచవద్దు.. ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే గీజర్‌ను ఆన్‌లో ఉంచండి. ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచితే గీజర్ వేడెక్కి బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్నానం పూర్తయిన వెంటనే స్విచ్ఛాఫ్ చేయకపోతే అనవసర ప్రమాదాలకు దారి తీసే అవకాశముంది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!