Almond Benefits: బాదం తింటే ఆరోగ్యంతో పాటు.. ముఖం మీద ఉండే మచ్చలు మాయం..!
- బాదం ఆరోగ్యానికి చాలా మంచిది
- చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగం
- దీనిలో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి
- శరీరాన్ని హైడ్రేట్‌గా.. అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా.. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అందుకే బాదం పప్పును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో.. అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి లోతైన పోషణనిస్తాయి. దీని వల్ల మన చర్మం మెరిసిపోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో కూడా బాదంపప్పు నుండి మెరిసే చర్మాన్ని పొందవచ్చు. రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పు తినాలి. అంతేకాకుండా.. దానిలో నూనెను కూడా అప్లై చేయవచ్చు. మీకు కావాలంటే బాదంను ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. మొత్తంమీద, బాదం చర్మానికి ఒక వరం కంటే తక్కువ కాదు. ఈ రోజు మనం బాదం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Read Also: Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?
Also Read
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది:
బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. ఇది సహజంగా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో సహాయపడుతుంది. బాదం చర్మానికి లోతైన పోషణను అందిస్తుంది. ఇది నిర్జీవ చర్మానికి కూడా జీవం పోస్తుంది. బాదం నూనెను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
మచ్చలు మాయమవుతాయి:
బాదం నూనెను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి. బాదం నూనె పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదం పాలుతో గాని.. పేస్ట్ గాని తయారు చేసి ముఖానికి రాసుకోవాలి. దీని వల్ల చర్మానికి అద్భుతమైన గ్లో వస్తుంది.
ముఖం సహజ కాంతిని పొందుతుంది:
రోజూ బాదంపప్పు తినడం వల్ల మన చర్మానికి అంతర్గత పోషణ లభిస్తుంది. దీని వల్ల చర్మం సహజసిద్ధమైన కాంతిని సంతరించుకుంటుంది. మీరు బాదం ఫేస్ ప్యాక్‌ను తయారు చేయడం ద్వారా కూడా మీ చర్మాన్ని మెరుగుపరచుకోవచ్చు. వారానికి రెండు రోజులు ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి అప్లై చేసుకోవచ్చు. బాదం పప్పు సూర్యుని హానికరమైన కిరణాల నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఇ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ పొరను ఏర్పరుస్తాయి. బాదం పప్పుతో టానింగ్, సన్ బర్న్ నివారించవచ్చు.
చర్మం పొడిని తొలగిస్తుంది:
విటమిన్ ఇ, ఒమేగా-3 వంటి అనేక పోషకాలు బాదంపప్పులో ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దీనివల్ల మన చర్మం కూడా మెరిసిపోతుంది. రోజూ బాదంపప్పు తింటే ముఖంలోని పొడిబారకుండా పోతుంది. మీరు రోజూ నానబెట్టిన బాదంపప్పులను నాలుగైదు తినాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..