కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి.. అనేక వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే.. చలికాలంలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు అనుకుంటారు. కానీ కొబ్బరి నీళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీలకర్రను వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. ఇది వంటకాల్లో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే బరువు తగ్గుతారు. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ క్రమంలో బరువు తగ్గడంలో సహాయపడతాయి.
రిషబ్ పంత్, నికోలస్ పురాన్‌లలో లక్నో జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఉండాలనే దానిపై జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తన అభిప్రాయాన్ని తెలిపారు. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌కు కెప్టెన్‌ని మరికొద్ది రోజుల్లో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
పుట్టగొడుగులు అన్ని సీజన్లలో మార్కెట్లో లభిస్తాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగు ఒక రకమైన ఫంగస్.. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులు తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. అంతేకాకుండా అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇవి తింటే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
పచ్చి పాలను చర్మ సంరక్షణ కోసం శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చి పాలతో ఫేషియల్ చేయడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ రెడ్డిగా గుర్తించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుండి జనవరి 2 వరకు సీఎం కప్ క్రీడోత్సవాలు (CM's Cup 2024) జరుగనున్నాయి. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. ఈ క్రీడోత్సవాలు 36 ఈవెంట్స్‌లో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు శివసేనా రెడ్డి పేర్కొన్నారు.
సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
రోజూ ఉదయం టీ తాగడం అందరికీ అలవాటే. అయితే.. పోషకాలు అధికంగా ఉండే మెంతి టీని తాగినట్లైతో మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి టీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో.. జీర్ణక్రియకు సహాయం చేయడం.. రక్తంలో చక్కెర, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మెంతి టీని మెంతి మొక్కలో ఉండే గింజల నుండి తయారు చేస్తారు.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఆడలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. సెకండ్ టెస్టుకు ఆడబోతుండటంతో.. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా దిగుతాడు అనుకున్నారు.