టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ఆమె బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డిల స్నేహం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సింగర్ చిన్మయితో పాటు శిల్పా రెడ్డి కూడా సామ్‌కు అత్యంత సన్నిహితురాలు. శిల్పా రెడ్డి జీవితంలోకి వచ్చాక సమంత జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు, చైతన్యతో విడాకుల తర్వాత సామ్‌కు అండగా నిలబడింది శిల్పా రెడ్డే. తన కుటుంబాన్నే సామ్‌కు కుటుంబంగా మార్చి, ఒంటరితనాన్ని దూరం చేసిన వారిలో ఆమె ప్రధానంగా ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు.
Also Read : Samantha-Raj : “మీరు సతి సావిత్రులా?” – సమంత రెండో పెళ్లి పై మాధవీలత షాకింగ్ ఫైర్!
సమంత తీసుకునే ప్రతి ముఖ్యమైన నిర్ణయం లో శిల్పా రెడ్డి ప్రమేయం ఉంటుందట.. తాజాగా డైరెక్టర్ రాజ్ తో జరిగిన రెండో పెళ్లి విషయంలో కూడా శిల్పా రెడ్డి చొరవ ఉందని, ఈ వివాహంలో ఆమె కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఇక సామ్ పెళ్లి ఫోటోలను కూడా శిల్పా స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ సమంత కూడా తన జీవితంలో శిల్పా రెడ్డి ప్రభావం గురించి ఎమోషనల్ అయ్యారు.. ‘శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో నీకు కూడా తెలియదు’ అంటూ సామ్ తన మనసులోని మాటను వెల్లడించారు.. అంతే కాదు..
‘నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన స్నేహితురాలు కేవలం వ్యక్తిగత సంతోషంలోనే కాకుండా, ఆధ్యాత్మి కంగా, మానసికంగా కూడా తన జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడిందని సామ్ ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్నేహ బంధం, సామ్ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.