ఇన్సానియత్….మానవత్వం. జమ్హూరియత్….ప్రజాస్వామ్యం. కశ్శీరియత్ స్నేహం….ఈ మూడు తమ కాశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని నాడు ప్రధానిగా అటల్ బిహరి వాజ్ పేయి అన్నారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుందని, కోయిలలు తిరిగి వస్తాయని, పూలు వికసిస్తాయని ఆకాక్షించారు…వాజ్ పేయి ఆశ కావచ్చు, ఆశయం కావచ్చు…వాటిని నెరవేర్చే దిశగా అన్నట్టుగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము ఎప్పటి నుంచో చెబుతున్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీరీ పండిట్లు తిరిగొస్తున్నారు….టూరిస్టులతో కళకళలాడుతోంది..డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరుగుతాయి…జమ్మూకాశ్మీరం మునుపటిలా […]
తెలంగాణపై ఎన్నడూలేనంతగా ద్రుష్టిపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ టు తెలంగాణ గల్లీ అంటూ అలజడి పెంచుతోంది. హస్తిన పెద్దలు హైదరాబాద్ లో వరుసగా ల్యాండవుతున్నారు. తెలంగాణపై వాగ్ధానాలు కురిపిస్తూనే, టీఆర్ఎస్ సర్కారుపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. ప్రతి సమస్యపైనా జెట్ స్పీడ్ తో రియాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా కాషాయదళం దండయాత్ర మొదలుపెట్టింది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పించ్ హిట్టింగ్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. అందులో భాగంగానే ఏకంగా జాతీయ […]
ఆదిలాబాద్ జిల్లా బిజెపిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు ఇప్పడప్పుడే లేకున్నా టికెట్ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అదిష్టానం మెప్పు కోసం వేర్వేరుగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఐతే ఉన్నట్టుండి బిజెపీ నాయకురాలు, మాజీ జెడ్పి చైర్పర్సన్ సుహాసిని రెడ్డి టిఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రచారం షురూ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఫొటో కలిపి ఓ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇది సుహాసిని రెడ్డి వ్యతిరేక వర్గం వాట్సాప్ స్టేటస్‌లో..అటు సోషల్ మీడియాలోనూ చక్కర్లు […]
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం […]
తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బిజెపి. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై దృష్టి పెట్టామని..రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ హైదారాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ప్రసంగించారు. పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు. […]
నెల్లూరు జిల్లాలో వై.సి.పి.నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా ఈ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్…మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. మంత్రి కాకాణికి తాను రెట్టింపు సహకారం అందిస్తామని అనిల్ కుమార్ వ్యంగంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. కాకాణికి శుభాకాంక్షలు చెప్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో […]
విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పారు. అలా చెప్పినట్లే ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హృదయం’ సినిమాకు మ్యూజిక్‌ను […]
హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు చేశారు. మాళవిక శర్మ, ‘బిగిల్’ ఫేమ్ అమృత, తమిళ బిగ్ బాస్ షోలో […]
తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావ సమయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు విజయం సాధిస్తూ వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి గాలి వీచినా …చంద్రబాబు సొంత జిల్లాలో కుప్పం మినహా మిగిలిన నియోజకవర్గాల వేల సంఖ్యలో ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి […]