Redfort : ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా)లో యునెస్కో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఎర్రకోట మరో విశేష ఆకర్షణగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులను స్వాగతిస్తూ అక్కడ ‘షాజహాన్’ ప్రత్యేకంగా దర్శనమిస్తోంది.
ఇక్కడ చెప్పుకుంటున్న షాజహాన్ మొఘల్ చక్రవర్తి కాదు. ఒకప్పుడు ఎయిర్ ఇండియాలో ఉపయోగించిన బోయింగ్ 747 జంబో జెట్‌కు చెందిన పెద్ద నమూనాకు ఈ పేరు పెట్టారు. ఇది ఎయిర్ ఇండియా అప్పట్లో ఉపయోగించిన ‘ఎంపరర్’ విమానాల సిరీస్‌లో ఒకటి. ఈ భారీ విమాన నమూనాను ప్రస్తుతం ఎర్రకోటలో, బ్రిటిష్ కాలం నాటి బ్యారక్ భవనం ముందు ఉంచారు. అదే బ్యారక్ భవనంలో తాజాగా ఓ గ్యాలరీని ప్రారంభించారు.
Pinaka Mk4 Missile: ఇక ఇస్లామాబాద్ వణకాల్సిందే – కరాచీ దద్దరిల్లాల్సిందే.. భారత ఆయుధామా మజకా
ఈ గ్యాలరీలో ఎయిర్ ఇండియాకు చెందిన ‘మహారాజా కలెక్షన్’ నుంచి ఎన్నుకున్న అరుదైన చిత్రాలు, పోస్టర్లు, కళాఖండాలు వంటి వస్తువులను ప్రదర్శిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సమావేశంలో భారతదేశ సంస్కృతి, చరిత్రను చూపించేలా ‘షాజహాన్’ విమాన నమూనా, ‘మహారాజా కలెక్షన్’ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గతం గుర్తులను ఆధునిక విమాన ప్రయాణాల ప్రపంచంతో కలిపి చూపేలా ఇవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘పార్టీల’’ లీడర్.. బెర్లిన్ టూర్‌పై బీజేపీ విమర్శలు..