తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావ సమయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు విజయం సాధిస్తూ వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి గాలి వీచినా …చంద్రబాబు సొంత జిల్లాలో కుప్పం మినహా మిగిలిన నియోజకవర్గాల వేల సంఖ్యలో ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి పాలైనా….తిరుపతిలో మాత్రం స్వల్ప తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో ఉన్నప్పటికీ ….చివరి రౌండ్‌లో వచ్చిన స్వల్ప మెజారిటీతో వైసిపి గట్టెక్కింది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో టీడీపీకి ఆశావాహులు కూడా అధికంగానే ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఇంచార్జిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కొనసాగుతున్నప్పటికీ ఆమె పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా లేరు. దీంతో….తమకు అవకాశం కల్పించాలంటూ అధినేత వద్ద క్యూ కడుతున్నారు ఆశావాహులు.
తిరుపతి అర్బన్ నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం సులభమని తెలుగు తమ్ముళ్లు గట్టిగా నమ్ముతున్నారు. అధినేత మాట ఇస్తే ఇప్పటి నుంచే కార్యచరణ ప్రారంభించాలని భావిస్తూన్న టిడిపి నేతలు….సీటు హామీ కోసం ప్రయత్నించి విఫలమయ్యారట. మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు దేవనారాయణరెడ్డి తనకు తిరుపతి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కలిశారట. తిరుపతికి వేరే లేక్కలు ఉన్నాయి….కావాలంటే చంద్రగిరి నియోజకవర్గంపై దృష్టిసారించాలని దేవ నారాయణ రెడ్డికి పార్టీ అధినేత సూచించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో యువజన నాయకుడు జేబీ శ్రీనివాస్ కూడా తనకు తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి వస్తానని అధినేతను కోరారట. అయినా.. అటు నుంచి సానుకూల స్పందన మాత్రం రాలేదట. అధినేతతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తిరుపతికి సంబంధించి వేరే లెక్కలు ఉన్నాయంటూ….తెలుగు తమ్ముళ్లుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూన్నారట. దీనికంతటికీ కారణం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన జట్టు కడితే…జనసేన తిరుపతి సీటును ఆ పార్టీ అడిగే అవకాశం ఉందని..అందుకే ఆ సీటు విషయంలో ఇప్పటి నుంచే ఆ సీటు విషయంలో క్లారిటీగా ఉన్నట్లు చెబుతున్నారు. వంద మంది ఆశావహులు వచ్చినా..ఆ సీటు రిజర్వుడ్ అని చెప్పకనే చెబుతున్నారట.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్..గాజువాక..భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించటంతో పాటు అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్న పవన్ తిరుపతినే సేఫ్ అనుకుంటున్నారట. మరి జనసేనాని అడుగుతున్నారని ఈ సీటును టీడీపీ రిజర్వు చేసిందా..లేక ఆల్రెడీ అడిగేశారని టీడీపీ నో వేకెన్సీ బోర్డు పెట్టిందా అని అనుమానాలు ఉన్నాయట రెండు పార్టీల క్యాడర్‌కు.
ఇక…2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టి స్థాపించినప్పుడు చిరంజీవి తిరుపతితో పాటు పాలకొల్లు నుంచి పోటి చేసినా…..తిరుపతిలో మాత్రం విజయం సాధించారు. ఇక జనసేన గట్టి మద్దతుదారులుగా వ్యవహరిస్తున్న బలిజలు అత్యధికంగా ఉండే తిరుపతి నియోజకవర్గాన్ని ఆ పార్టీ వదులుకొనే పరిస్థితి ఉండదు. దీంతో కొత్తగా ఇంచార్జిని నియమించి….ఎన్నికల సమయంలో వారికి హ్యాండ్ ఇచ్చి ….కొత్త సమస్యలు తెచ్చుకునేకంటే….ముందస్తూగానే జాగ్రత్త పడడం ఉత్తమం అని టిడిపి అధినాయకత్వం భావిస్తుందట.