అత్యంత ఉత్కంఠగా అత్యున్నత సమరం…వ్యూహప్రతివ్యూహాల్లో అధికార, విపక్షాలు..విపక్ష కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా…వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేసిన సిన్హా..ఒకప్పటి తన సొంత పార్టీపైనే ఇప్పుడు పోటీకి సై…ఊహకందని వ్యూహాలతో కాషాయదళం.మహారాష్ట్రలోని ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు వల ..రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ కోసమేనని జోరుగా ప్రచారం..దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి ఆర్టికల్ 53, 74(2) ప్రకారం రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు..రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారం..భారత రాష్ట్రపతి ఎన్నికల […]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏటా 120 కోట్ల ఆదాయం వచ్చే ఈ పుణ్య క్షేత్రంలో 238 మంది పని చేస్తున్నారు. ఆలయంలో ఐదేళ్లు పైబడి ఒకేచోట తిష్ఠవేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఆ జాబితాలో 80 మందిని గుర్తించారట. నెలాఖరులోగా ఆ ప్రక్రియ కొలిక్కి వస్తుందని అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఏళ్ల తరబడి అన్నవరం ఆలయంలోనే పాతుకుపోయిన వారిలో గుబులు రేగుతోందట. బదిలీ […]
ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
నల్లు ఇంద్రసేనారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. అప్పట్లో వేళ్లమీద లెక్కపెట్టే బీజేపీ నేతల్లో ఒకరు. గతంలో బీజేపీకి రాష్ట్ర చీఫ్‌గానూ పనిచేశారు ఇంద్రసేనారెడ్డి. ప్రస్తుతం బీజేపీలో ఇతర పార్టీల నాయకుల చేరికలకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డితోపాటు ఆ కమిటీలో ఏడుగురు పార్టీ నేతలు సభ్యులు. తెలంగాణలో బీజేపీలో ఎవరైనా చేరాలి అని అనుకుంటే ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చేవారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభం.. […]
కర్నూలు జిల్లాలో అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగించినట్టే కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్లోను సత్తా చాటింది. మున్సిపల్ కార్పొరేషన్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు, మేయర్, 52 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఉన్నారు. అంతమంది ఉన్నారు కదా.. పార్టీ బలంగా ఉంటుందని భావించిన కేడర్‌కు చుక్కలు కనిపిస్తున్నాయట. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు స్తంభాలాట సాగుతోంది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే […]
వి. హన్మంతరావు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఆయన నియోజకవర్గం అంబర్‌పేటలో అడుగు పెట్టాలంటే పార్టీ నేతలు హడలిపోతారు. పేరుకు సీనియరైనా.. నియోజకవర్గాన్ని VH అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శ కాంగ్రెస్ వర్గాల్లోనే ఉందట. ఎన్నికల్లో VH పోటీ చేసే పరిస్థితి లేదన్నది కొందరి వాదన. అలాగని అంబర్‌పేట కాంగ్రెస్‌లో బలమైనే నేతనూ తయారు చేయడం లేదట. 2018 ఎన్నికల్లో పొత్తులో బాగంగా.. అంబర్‌పేటను కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం […]
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట వీర్రాజు. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి […]