ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. […]
పార్టీ సర్వేలో నిలిచేది ఎందరు?సర్వేలు.. వడపోతలు.. నిఘా వర్గాల నివేదికలు. ప్రస్తుతం టీఆర్ఎస్లో చర్చగా మారిన అంశాలివే. వీటి ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందనే అంతర్గత చర్చ చాలామంది ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. సర్వేలో నిలిచింది ఎవరు? జారిపోయింది ఎవరు అనేది అంతుచిక్కని పరిస్థితి. ఇదే సమయంలో రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఎమ్మెల్యేలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. 2014లో తొలిసారిగా అధికారంలోకి […]
విశాఖ నగరంపై పట్టు సాధించేందుకు అధికార వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తోంది. సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ అవసరాలు.. ఇలా అన్నింటినీ పక్కాగా లెక్కేసుకుని ముందుకెళ్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల నుంచి మంత్రివర్గ విస్తరణలో అవకాశాల వరకు ప్రతీదానికీ కేలిక్యూలేషన్స్ ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలపై కొంత వ్యతిరేకత ఉన్నా.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బయటపడిన సందర్భాలు తక్కువే. 2024నాటికి జీవీఎంసీ పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలనూ కైవశం చేసుకోవాలని […]
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువే..! కానీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సామాజిక ఈక్వేషన్ దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గమనించకుండా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలు ఉంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ అని చెబుతున్న కాంగ్రెస్‌లోనే ఆ సమీకరణాల లెక్క తప్పడంతో కొత్త చర్చ మొదలైంది. పార్టీ నేతల నుంచే పెదవి విరుపు వస్తోందట. నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో […]
వేసవి కాలం వచ్చిందంటే చాలు మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు బాగా తినేస్తాం. ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయించడం ఎంతమాత్రం మంచిదికాదంటున్నారు డాక్టర్లు. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగాలి. రోజుకి 4 లీటర్ల మంచి నీరు తాగాలి. నాన్ వెజ్ […]
వైవీ సుబ్బారెడ్డి రాకతో కలిగే ప్రయోజనాలపై చర్చ.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వే విశాఖపట్నం. ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువుపట్టు. ఇక్కడ ఫలితాలు పార్టీల పటిష్టత, భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయి. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ విశాఖపై ఉంటుంది. వచ్చే రెండేళ్లూ ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయకర్త బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది అధికార పార్టీ. కొత్త బాస్రాకతో […]
రాష్ట్ర నేతల అనుభవం ముందు ఇంఛార్జ్ ఠాగూర్ తేలిపోతున్నారా? మాణిక్యం ఠాగూర్. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. తెలంగాణ వరకు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్. రాష్ట్రానికి ఇంఛార్జ్‌గా వచ్చినప్పుడు ఠాగూర్ గురించి ఏదేదో అనుకున్నారు. కానీ.. పార్టీ నాయకులను ఆయన గాడిలో పెట్టలేకపోతున్నారని తెలియడానికి ఎంతో టైమ్ పట్టలేదు. ఇందుకు ఠాగూర్ అనుభవ రాహిత్యం.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అనుభవం ముందు తేలిపోతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమాండింగ్ లేదు.. కంట్రోలింగ్ అంతకంటే […]
కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్ ఛైర్పర్సన్. […]
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయ్. గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య వచ్చిన గ్యాప్‌తో రెండు వ్యవస్థల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజ్‌భవన్‌పై పదునైన విమర్శలు చేస్తున్నారు మంత్రులు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలపై గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరడంతో పరిస్థితి వేడెక్కిందని పరిశీలకు భావిస్తున్నారు. రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్యలపైనే కాకుండా.. మెడికల్ సీట్ల రగడపైనా నివేదిక కోరారు గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు రావడం లేదన్న వాదన వినిపిస్తున్నాయి […]
రాజకీయాలలో నల్లపురెడ్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ కేబినెట్లో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నెంబర్-2గా కొనసాగారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్రసన్నకుమార్‌రెడ్డి అనూహ్యంగా వైఎస్ఆర్ వైపు చేరారు. వైఎస్ హఠాన్మరణంతో జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు కూడా. 2012లో జరిగిన కోవూరు ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు ప్రసన్నకుమార్‌రెడ్డి. నాడు వైసీపీ తరఫున వైఎస్ విజయమ్మ తర్వాత […]