Surveen Chawla : ఈ నడుమ చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో నటి ఇలాంటి షాకింగ్ కామెంట్లే చేసింది. దగ్గుబాటి రానా, వెంకటేశ్ నటించిన రానా నాయుడు సిరీస్ అప్పట్లో ఎంత సంచలనం రేపిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ లో నటించిన సుర్వీన్ చావ్లా తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్టు తెలిపింది. తాను ఎన్నో సినిమాల్లో నటించానని.. కానీ కొందరు మాత్రం తనను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారంటూ తెలిపింది.
Read Also : Lal Salam : ఎట్టకేలకు ఓటీటీలోకి రజినీకాంత్ ‘లాల్ సలాం’..
నేను అప్పట్లో ఓ సినిమా మీటింగ్ కోసం ఓ డైరెక్టర్ క్యాబిన్ కు వెళ్లాను. మీటింగ్ అయిపోయాక తిరిగి వస్తుండగా ఆ డైరెక్టర్ నన్ను లాగి ముద్దు పెట్టబోయాడు. నేను అతన్ని పక్కకు నెట్టేసి అరిచి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాను. ఓ సౌత్ సినిమా డైరెక్టర్ కూడా తనకు కమింట్ కోసం అతని ఫ్రెండ్ తో నన్ను అడిగించాడు.
ఇలాంటి చాలా సార్లు జరిగాయి. ఒప్పుకోకపోతే నాకు అవకాశాలు కూడా ఇవ్వలేదు. అయినా సరే నేను వారి బెదిరింపులకు లొంగలేదు. అప్పట్లో బాడీ షేమింగ్ కూడా చేశారు. అయినా సరే నేను భయపడలేదు. ఇప్పటికీ నాకు ఇలాంటివి ఎదురవుతుంటాయి. నేను నా ట్యాలెంట్ ను నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చాను. అదే నన్ను ముందుకు తీసుకెళ్తోంది’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ.
Read Also : Nara Lokesh: లోకేష్ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టారా..?