Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nissan Magnite CNG: పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలో భాగంగా వినియోగదారులకు మరింత ఆప్షన్లను అందించాలనే ఉద్దేశంతో నిస్సాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ కోసం సీఎన్జీ రెట్రోఫిట్మెంట్ కిట్‌ను ప్రవేశపెట్టింది. దీనిని వినియోగదారులు రూ. 74,999కి పొందవచ్చు. ఈ సీఎన్జీ కిట్‌ను మోటోజెన్ అనే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ అభివృద్ధి చేసింది. ఇది 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. సురక్షితంగా అమలు చేయడానికీ, స్థానిక నిబంధనల ప్రకారం ఫిట్మెంట్‌ను ప్రభుత్వ అధికారిక ఫిట్మెంట్ కేంద్రాల్లోనే మాత్రమే నిర్వహించనున్నారు.
Read Also: KTM E-Duke: బైక్ లవర్స్ గెట్ రెడీ.. కేటీఎం నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది..
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
సీఎన్జీ కిట్ 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్న వేరియంట్‌కి మాత్రమే లభ్యమవుతుంది. మొదటి దశలో ఈ సౌకర్యం ఢిల్లీ-ఎన్సీఆర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది. తర్వాతి దశలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
Read Also: Manda Krishna Madiga: నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం!
కొత్త మాగ్నైట్ SUV 20కి పైగా ఫస్ట్-ఇన్-సెగ్మెంట్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లు, అలాగే 55కి పైగా భద్రతా ఫీచర్లతో వస్తోంది. ఇది 65కి పైగా దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవుతోంది. రైట్-హ్యాండ్, లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ అనే రెండు రకాల డ్రైవింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇకపోతే, ఈ కొత్త సీఎన్జీ ఆప్షన్స్ ద్వారా నిస్సాన్ మాగ్నైట్ సేవింగ్, పర్యావరణ అనుకూలంగా వినియోగదారుల మధ్య మరింత ఆకర్షణీయంగా మారనుంది. దీని ద్వారా ప్రస్తుత కాంపాక్ట్ SUV మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేయాలని నిస్సాన్ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!