ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో మే 30 (శుక్రవారం)న గుజరాత్ టైటాన్స్ (GT) ముంబై ఇండియన్స్ (MI)తో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్లింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. హిట్‌మ్యాన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ప్రసీధ్ కృష్ణ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. కాగా ఐపీఎల్ లో రోహిత్ రికార్డుల మోత మోగించాడు.
Also Read:Lal Salam : ఎట్టకేలకు ఓటీటీలోకి రజినీకాంత్ ‘లాల్ సలాం’..
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో 47వ అర్ధశతకం. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ ఐపీఎల్‌లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు. కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో 357 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ తన 266వ ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్కును తాకిన రెండవ బ్యాట్స్‌మన్ రోహిత్. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇప్పటివరకు 266 మ్యాచ్‌ల్లో 39.53 సగటుతో 8618 పరుగులు చేశాడు. ఈ కాలంలో కోహ్లీ 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Also Read:Nara Lokesh: లోకేష్ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టారా..?
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ముందు 229 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో్యిన జీటీ 208 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో, 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ముంబై.. ఐపీఎల్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆదివారం రోజు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలబడబోతోంది ముంబై ఇండియన్స్.
He is in the mood tonight 😎
Rohit Sharma, the 𝐁𝐢𝐠 𝐌𝐚𝐭𝐜𝐡 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 🫡
Updates ▶ https://t.co/R4RTzjQfph #TATAIPL | #GTvMI | #Eliminator | #TheLastMile | @ImRo45 pic.twitter.com/WJsarasZuI
— IndianPremierLeague (@IPL) May 30, 2025