Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto g86 Series: మోటొరోలా తాజాగా మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను ప్రకటించింది. మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G ఫోన్లు అధికారికంగా యూరప్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల వివరాలు ముందు గానే లీకైనప్పటికీ, ఇప్పుడు పూర్తిగా అధికారికంగా లభించనున్నాయి. మూడు ఫోన్లు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిళ్ల గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తున్నాయి. ఈ మోటో G86 సిరీస్ ఫోన్లు 6.67 అంగుళాల FHD+ 10-బిట్ కర్వుడ్ pOLED డిస్‌ప్లేతో వస్తాయి. వీటి రిఫ్రెష్ రేట్ 120Hz కాగా, పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ ఉండనున్నాయి. ఈ సిరీస్‌లోని ఫోన్లు మెడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. కెమెరా విషయంలో 50MP సోనీ LYTIA 600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ + మాక్రో కాంబో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో ఉన్నాయి. మోటో G86 పవర్ 5G ఫోన్‌లో భారీ 6720mAh బ్యాటరీ ఉంది. మిగతా G86, G56 ఫోన్లలో 5200mAh బ్యాటరీ ఉంది. మూడు ఫోన్లూ 30W టర్బోచార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి.
Read Also: PBKS vs RCB: ఇది మర్చిపోలేని రోజు.. అదే మా ఓటమిని శాసించింది: శ్రేయాస్
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
మోటో G56 5G స్పెసిఫికేషన్లు:
* 6.72 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
* మెడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్
* 8GB RAM, 128/256GB స్టోరేజ్ (మైక్రో SDతో 2TB వరకు విస్తరించవచ్చు)
* Android 15, 2 OS అప్‌డేట్స్ + 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్
* 50MP + 8MP రియర్ కెమెరాలు
* 32MP సెల్ఫీ కెమెరా
* సైడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
* 5200mAh బ్యాటరీ, 30W ఛార్జింగ్
* IP68/IP69 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్
* మోటో G56 బిజినెస్ ఎడిషన్ వర్షన్ ఒక సంవత్సరం మోటో డివైస్ మేనేజర్, జీరో టచ్ మేనేజ్మెంట్, మోటో సేఫ్ ఇంకా మోటో సాఫ్ట్‌వేర్ కంట్రోల్‌తో వస్తుంది. ఇందులో అదనంగా సంవత్సర కాలం వారంటీ, క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, CO2 ఆఫ్సెట్ సేవలు కూడా ఉన్నాయి.
Read Also: Tiger: చనువిచ్చింది కదా అని ఆడుకుంటే.. రీల్స్ చేసిన వ్యక్తిపై దాడి చేసిన పులి
మోటో G86 5G, G86 పవర్ 5G స్పెసిఫికేషన్లు:
* 6.67 అంగుళాల FHD+ 10-bit pOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
* డైమెన్సిటీ 7300 ప్రాసెసర్
* 8GB/12GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 15, 2 OS + 4 సంవత్సరాల సెక్యూరిటీ
* 50MP (OIS) + 8MP అల్ట్రావైడ్ కెమెరాలు
* 32MP సెల్ఫీ కెమెరా
* ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, డాల్బీ ఆటమ్స్ , సిస్టమ్ ఆడియో
* 5200mAh బ్యాటరీ (G86), 6720mAh (G86 పవర్) – 33W ఛార్జింగ్
* IP68/IP69 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్
ధరలు:
ఈ మొబైల్స్ పాంటోన్ కోస్మిక్ స్కై, క్రైసాంథెమం, గోల్డెన్ సైప్రస్, స్పెల్‌బౌండ్ రంగులలో లభిస్తాయి. ఇక ధర విషయానికి వస్తే..
మోటో G56 5G (8GB + 256GB): 284 డాలర్స్ ( రూ. 24,250)
మోటో G86 5G: 339 డాలర్స్, (రూ. 29,000)
మోటో G86 Power 5G: 374 డాలర్స్, (రూ. 32,000)
ఈ ఫోన్లు ఇప్పటికే యూకే, యూరప్‌లో లభ్యమవుతున్నాయి. త్వరలోనే ఇతర మార్కెట్లలోనూ విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!