టీడీపీలోకి మాజీ మంత్రి రావెల రీఎంట్రీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. గుంటూరు రూరల్‌లోనే టీడీపీ బలహీనం. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.. తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నాయకుడి లేని నియోజకవర్గంగా మారిపోయింది.
ఇంఛార్జ్ నియామకంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఎంపిక కొలిక్కి రావడం లేదట. దీంతో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను సమన్వయకర్తగా నియమించారు. అయితే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ముందుగానే ఇంఛార్జ్‌ను నియమిస్తే ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకుంటుందనేది కేడర్ వాదన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంఛార్జ్ లేకపోయినా కార్యకర్తలు వైసీపీకి గట్టిపోటీనే ఇచ్చారు. గతంలో ప్రత్తిపాడులో పోటీ చేసిన కందుకూరి వీరయ్య పేరుపై చర్చ జరిగిందట. అయితే వీరయ్య తన ఆర్ధిక పరిస్థితి గురించి నాయకులకు చెప్పినట్టు సమాచారం. పార్టీ సహకరిస్తే పోటీ చెయ్యడానికి సిద్దమని ఆయన చెప్పారట.
Also Read
రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారని ప్రచారం చంద్రబాబుతో రావెల భేటీ?2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా చేసిన రావెల కిశోర్‌బాబు పేరు సడెన్‌గా పార్టీలో చర్చకు వస్తోంది. గతంలో జిల్లా టీడీపీ నేతలతో విబేధాలు రావడంతో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ కండువా కప్పుకొన్నారు. అయితే రావెల మళ్లీ టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జోరందకుంది. కొంతమంది టీడీపీ నేతలతో రావెల టచ్‌లో ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కొందరు మండలస్థాయి టీడీపీ నేతలు కూడా రావెల రీఎంట్రీకి సానుకూలంగా ఉన్నారట. వ్యతిరేకత కూడా ఉందట. ఇదే సమయంలో చంద్రబాబుతో రావెల భేటీ అయినట్టు ప్రచారం గుప్పుమంది. ప్రత్తిపాడు నేతలు రావెల విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన చూద్దామని సమాధానం ఇచ్చారట. రావెల రీఎంట్రీ ఖాయమైతే ఆయనే ప్రత్తిపాడు ఇంఛార్జ్‌గా రావొచ్చని చెవులు కొరుక్కుంటున్నారట తమ్ముళ్లు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2010 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..