K Vishwanath : ఆ ఇద్దరితో విశ్వనాథ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని ప్రతీతి. వారిద్దరూ నటించిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేస్తూనే తాను సినిమా కళను అధ్యయనం చేశానని కె.విశ్వనాథ్ పలు పర్యాయాలు చెప్పుకున్నారు. విజయా సంస్థ యన్టీఆర్ హీరోగా రూపొందించిన “పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు” వంటి చిత్రాలకు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో పనిచేశారు. ఇక అన్నపూర్ణ సంస్థలో ఏయన్నార్ నటించిన “తోడికోడళ్ళు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి” చిత్రాలకు ఆదుర్తి దర్శకత్వంలో అక్కినేని నటించిన “మంచి మనసులు, మూగమనసులు” చిత్రాలకు కూడా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. 1966లో ‘ఆత్మగౌరవం’ చిత్రంతో దర్శకుడయ్యారు. ఆ సినిమాలో ఏయన్నార్ హీరో. అలా విశ్వనాథుని తొలి హీరోగా ఏయన్నార్ నిలిచారు. ఆ తరువాత ఏయన్నార్ తో మళ్లీ 23 ఏళ్‌ళకు అంటే 1989లో ‘సూత్రధారులు’ రూపొందించారు విశ్వనాథ్. మరి విశ్వనాథ్ చిత్రంలో నటించడానికి ఏయన్నార్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో తెలియదు.
ఇక యన్టీఆర్ తో విశ్వనాథ్ అనుబంధం ప్రత్యేకమైనది. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన విజయా సంస్థతో విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం కు అనుబంధం ఉండేది. విజయా సంస్థ నిర్మించిన చిత్రాలను విడుదల చేసేసమయంలోనూ, వాటి ప్రచారంలోనూ సంస్థాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణికి సుబ్రహ్మణ్యం సహకరిస్తూ ఉండేవారు. అలా విశ్వనాథుని తండ్రి సుబ్రహ్మణ్యంతో రామారావుకు ముందే పరిచయం ఉంది. విశ్వనాథ్ దర్శకుడు అయ్యారని తెలియగానే యన్టీఆర్ ఎంతో సంతోషించారు. తనతోనూ సినిమా తీయమని కోరారు రామారావు. అలా యన్టీఆర్ తో విశ్వనాథ్ “కలిసొచ్చిన అదృష్టం (1968), నిండు హృదయాలు (1969), చిన్ననాటి స్నేహితులు (1971), నిండుదంపతులు (1971)” తెరకెక్కించారు. ఈ చిత్రాలలో ‘చిన్ననాటి స్నేహితులు’ చిత్రాన్ని డి.వి.యస్.రాజు నిర్మించగా, మిగిలిన మూడు చిత్రాలను మిద్దే జగన్నాథరావు తెరకెక్కించారు. ఈ నాలుగు చిత్రాలకూ టి.వి.రాజు స్వరకల్పన చేశారు. ఆ తరువాత యన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వనాథ్ రూపొందించిన “స్వాతిముత్యం (1986), శ్రుతిలయలు (1987)” చిత్రాల ద్వారా ఆయన ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ విశ్వనాథ్ దర్శకత్వంలో నటించాలని ఉందని యన్టీఆర్ అభిలషించారు.
Also Read
- Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
- KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!