K. Viswanath: తెలుగులో కళాతపస్విగా తనదైన బాణీ పలికించిన కె.విశ్వనాథ్ హిందీలోనూ తనదైన బాణీ పలికించారు. తన దర్శకత్వంలో తెలుగులో ఘనవిజయం సాధించిన ‘సిరిసిరిమువ్వ’ ఆధారంగా హిందీలో ‘సర్గమ్’ చిత్రాన్ని రూపొందించారాయన. విశ్వనాథుని ప్రతిభ తెలిసి హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా రాణిస్తున్న ఎన్.ఎన్.సిప్పి ఈ ‘సర్గమ్’ను నిర్మించారు. ఈ సినిమాతోనే జయప్రద బాలీవుడ్ లో అడుగు పెట్టారు. రిషికపూర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీ చూసింది. అక్కడ కూడా తనదైన బాణీ పలికించిన విశ్వనాథ్ ఆ తరువాత హిందీలో “కామ్ చోర్, శుభ్ కామ్నా, జాగ్ ఉఠా ఇన్సాన్, సన్జోగ్, సుర్ సంగమ్, ఈశ్వర్, సంగీత్, ధన్ వాన్, ఔరత్ ఔరత్ ఔరత్” వంటి చిత్రాలు రూపొందించారు. వీటిలో ‘సర్గమ్’ స్థాయిలో ఏ చిత్రమూ విజయం సాధించలేదు. అయినా, అక్కడ కూడా విశ్వనాథ్ బాణీకి జనం జేజేలు పలికారు.
Read Also: K.Vishwanath: విశ్వనాథ్ ‘ఎస్’ సెంటిమెంట్!