ఒకప్పుడు నాజూకు షోకులతో ప్రేక్షకులను పరవశింప చేసిన నటి రవీనా టాండన్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. రవీనా టాండన్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల బాలీవుడ్ లో ఆనందం వెల్లివిరిసింది. రవీనా టాండన్ ఉత్తరాదిన అజయ్ దేవగన్ తో కలసి అనేక చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. ఖిలాడీ కుమార్ గా పేరొందిన అక్షయ్ కుమార్ కు జోడీగానూ భలేగా అలరించారు. ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలతోనూ భలేగా మురిపించారు. తెలుగు […]
తెలుగు చిత్రసీమలో తనదైన వాణి వినిపించి, తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న మధురగాయని వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పద్మభూషణ్ అవార్డు చోటు చేసుకోవడం సంగీత ప్రియులందరికీ ఆనందం పంచుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త వినగానే దేశవిధేశాల్లోని వాణీ జయరామ్ అభిమానుల ఆనందం అంబరమంటింది. వాణీ జయరామ్ ప్రతిభకు కేంద్రం తగిన సమయంలో సరైన అవార్డును ప్రదానం చేస్తోందని పలువురు సంగీతాభిమానులు ప్రశంసిస్తున్నారు. తమిళనాట […]
Niluvu Dopidi: నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించిన రెండవ చిత్రం ‘నిలువు దోపిడీ’. అంతకు ముందు వీరిద్దరూ ‘స్త్రీ జన్మ’లో అన్నదమ్ములుగానే అభినయించారు. విశేషమేమిటంటే, ఎన్టీఆర్‌తో కృష్ణ నటించిన ఐదు చిత్రాలలోనూ ఆయనకు తమ్మునిగానే నటించారు. కృష్ణ వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో రూపొందిన ‘నిలువు దోపిడీ’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన యు.విశ్వేశ్వరరావు నిర్మించారు. తరువాతి రోజుల్లో విశ్వేశ్వరరావు కూతురును యన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ వివాహం చేసుకోవడంతో వారిద్దరూ వియ్యంకులు కూడా […]
ఈ సారి భారతీయులకు 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు..." సాంగ్ ఎంత ఆనందం పంచిందో, అదే తీరున 'ఆస్కార్ నామినేషన్' సైతం సొంతం చేసుకొని మరింత ఉత్సాహాన్ని ఉరకలేయిస్తోంది.
నటరత్న నందమూరి తారక రామారావు, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని తెలుగు సినీజనం పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే ఆ ఇద్దరు మహానటులు నేడు లేరు.
ఓ వైపు అంతర్జాతీయ యవనికపై తెలుగు సినిమా వెలుగులు విరజిమ్ముతూ 'ట్రిపుల్ ఆర్' బృందం విజయ విహారం చేస్తోంది. మరోవైపు టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం తెలుగువారికే తలవంపులు తెచ్చేలా వినలేని మాటల యుద్ధంతో తమ హీరోల సినిమాలకు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి!
ANR Vardanti: ఉత్తరాదిన ‘ట్రాజెడీ కింగ్’ అనగానే మహానటుడు దిలీప్ కుమార్ ను గుర్తు చేసుకుంటారు. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఆ ‘ట్రాజెడీ కింగ్’ అన్న మాటకు ప్రాణం పోశారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. భగ్నప్రేమికులను చూడగానే పాత కథలు గుర్తు చేసుకుంటూ ఉంటారు జనం. అలా విఫలమై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రేమకథల్లో మనకు ముందుగా ‘రోమియో-జూలియట్’,’లైలా-మజ్ను’ వంటివి కనిపిస్తాయి. తరువాత మన దేశం విషయానికి వస్తే ‘సలీమ్- అనార్కలి’, ‘దేవదాసు’ కథలూ స్ఫురిస్తాయి. […]
Naga Shourya Birthday: ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో యంగ్ హీరో నాగశౌర్య నటించేశాడు. వాటిలో కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకరింపచేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో ‘లక్ష్య’ చిత్రం చూస్తే తెలుస్తుంది. ఆ తరువాత వచ్చిన నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ సైతం ఆకట్టుకోలేక పోయింది. అయినా పట్టువదలని విక్రమార్కునిగా సాగుతున్న నాగశౌర్య ఈ యేడాది ఏకంగా మూడు చిత్రాలతో మురిపించే […]