ఈరోజు ఉగాది పర్వదినం. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగువారికి న్యూ ఇయర్ అన్నమాట. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది కూడా ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఈరోజు శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికాము. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. కాగా […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ‘ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి… నో శాడ్ నెస్ అండ్ టెన్షన్స్… […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో ‘ఐకాన్’ చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో మేకర్స్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి దర్శకుడు వేణు శ్రీరామ్ బన్నీ గురించి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేంటో తెలియదు గానీ ఇప్పటివరకు ‘ఐకాన్’ పట్టాలెక్కలేదు. బన్నీ ‘అలా వైకుంఠపురంలో’ తరువాత ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు సరికదా […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ‘ఖిలాడీ’ 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ‘ఖిలాడీ’ […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం (ఏప్రిల్ 9) విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. ప్రస్తుతం వంద కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతున్న ఈ చిత్రం త్వరలోనే ఓటిటిలో విడుదల కానుందనే రూమర్స్ మొదలయ్యాయి. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది స్పెషల్ గా ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో నవ్వుతూ హ్యాండ్సమ్ గా కన్పిస్తున్నారు. అయితే ‘రాధేశ్యామ్’ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిన్న గ్లిమ్స్ వదిలిన మేకర్స్ మళ్ళీ ఇప్పటికి వరకు ఒక్క అప్డేట్ […]
గతేడాది కరోనా కారణంగా థియేటర్లు బంద్ అయ్యాయి. చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడిపుడే కోలుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ కాటువేయబోతోందా? అంటే అవుననే వినిపిస్తోంది. ప్రభుత్వం బంద్ ప్రకటించకున్నా… థియేటర్లు స్వచ్ఛధంగా బంద్ పాటించే పరిస్థితి ఎదురుకాబోతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘వకీల్ సాబ్’ తప్ప వేరే ఏ సినిమా థియేటర్లలో కనిపించటం లేదు. అసలు కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ తప్ప వేరే ఏ భాషా సినిమాలకు అంత అశాజనకమైన స్థితి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’గా జనం ముందుకొచ్చాడు. ఫస్ట్ డే ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి… ‘ఇది వసూల్ సాబ్’ అన్నవాళ్ళూ ఉన్నారు. అయితే… ‘వకీల్ సాబ్’ మూవీ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు అధికారికంగా ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. తెలంగాణాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. కానీ… ఆంధ్రాలో పరిస్థితి వేరు. తొలి రెండు రోజులు అత్యధిక రేట్లకు […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా […]