మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ “ఖిలాడీ”. రవితేజకు ఇది 67వ చిత్రం. ‘రాక్షసుడు’ ఫేమ్ డైరెక్టర్ రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 12న ‘ఖిలాడీ’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ‘ఖిలాడీ’ 3 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ‘ఖిలాడీ’ ఉగాది పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్. టీజర్లో ‘ఇఫ్ యూ ప్లే స్మార్ట్ విత్ అవుట్ స్టుపిడ్ ఎమోషన్స్… యూ ఆర్ అన్ స్టాపబుల్’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివర్లో వచ్చిన ట్విస్ట్ అందరినీ థ్రిల్ చేసింది. రవితేజ ఒక అమ్మాయిని చంపుతూ కన్పించి అందరికీ షాకిచ్చాడు. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జయంతిలాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఖిలాడీ’ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా… టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.