అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ను ఉగాది పండగ రోజున స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ మేరకు సెట్స్ లోని పిక్స్ షేర్ చేస్తూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ‘ఈ ఇయర్ మొత్తం ఓన్లీ ఆనందం అండ్ ఫన్ ఉండాలి… నో శాడ్ నెస్ అండ్ టెన్షన్స్… ‘ అంటూ ట్వీట్ చేశారు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు ఇదివరకు విడుదల చేసిన పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. వెంకీ, తమన్నా, వరుణ్, మెహ్రీన్ పాత్రలు డబ్బు సంపాదనపై విపరీతంగా దృష్టి పెట్టటంతో ఇబ్బందులు వస్తాయట. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో కూడా కొనసాగుతున్నారు. ‘ఎఫ్3’లోని ఓ కీలకపాత్ర కోసం అంజలిని తీసుకోబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ చిత్రం 2021 ఆగష్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.