సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ‘అన్నాత్తే’ షూటింగ్ స్పాట్ లో రజినీకాంత్, దర్శకుడు శివ కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేశారు నిర్మాతలు. ఈ పిక్ లో రజినీకాంత్ తెల్లని చొక్కా, పంచ ధరించి స్టైలిష్ గా కన్పిస్తున్నారు. ఇక 2020 డిసెంబరులో కాస్త అనారోగ్యానికి గురైన రజినీకాంత్ ఇప్పుడు కోలుకుని ‘అన్నాత్తే’ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది నవంబర్ 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది.