సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రాజెక్ట్ పై అప్డేట్ రానుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘SSMB28’పై ఈరోజు అధికారిక ప్రకటన రానుండడం మహేష్ అభిమానులను హుషారెత్తిస్తోంది. ‘SSMB28’ మూవీ స్టోరీ ఏంటనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ‘మహర్షి’ తర్వాత మహేష్‌తో ఆమె చేయబోయే రెండవ చిత్రం ఇది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఖలేజా, అతడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే హ్యాట్రిక్ మూవీ ‘SSMB28’. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉండగా… పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. తరువాత ఎన్టీఆర్ తో ఓ చిత్రం చేయనున్నాడు త్రివిక్రమ్. మరి ‘SSMB28’ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.