‘ఉక్కు సత్యాగ్రహం’ పాట ఆవిష్కరించిన గద్దర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ పై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో సత్యారెడ్డి తానే ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రజా యుద్థ నౌక గద్దర్ ఓ పాటను రాసి, పాడారు. ‘సమ్మె నీ జన్మహక్కురన్నో’ అనే ఈ లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటను సత్యారెడ్డితో పాటు ఇతర నటీనటులపై చిత్రీకరించారు. ఇప్పటికే వైజాగ్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేశామని, అక్కడే ఈ పాటను చిత్రీకరించామని సత్యారెడ్డి అన్నారు. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత మరో షెడ్యూల్ మొదలు పెడతామని చెప్పారు. ఈ సినిమాలో 13 నిమిషాల పాటు సాగే మరో పాట ఉందని, దానిని గద్దర్ పాడుతున్నారని, ఆయన మీదే ఆ పాటను చిత్రీకరిస్తామని సత్యారెడ్డి తెలిపారు. సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, చంద్రబోస్ ఇందులోని మిగతా పాటలు రాస్తున్నారని, ఈ సినిమాలో విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, రాజకీయ ప్రముఖులకు కూడా నటించబోతున్నారని సత్యారెడ్డి చెప్పారు. ఓ మంచి ఉద్యమ చిత్రాన్ని ఉద్యమ కాలంలో తీస్తున్న సత్యారెడ్డిని గద్దర్ ఈ సందర్భంగా అభినందించారు.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
- Tags
- Gaddar
- Ukku Satyagraham
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!