అల్లు వారి ఫ్యామిలీని కరోనా చాలా ఇబ్బందే పెట్టేస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే తాను కరోనా బారిన పడ్డానని అయితే వాక్సిన్ వేయించుకోవడం వల్ల అది తనను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఇక అల్లు అర్జున్ సైతం కరోనాతో హోమ్ ఐసొలేషన్ లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ సైతం తన కరోనా టెస్ట్ ఫలితాలను వెల్లడించారు. ఇంట్లో కొందరికి కరోనా వచ్చిన నేపథ్యంలో నిన్న, ఈ రోజు కూడా తాను కోవిడ్ 19 టెస్ట్ చేయించుకున్నానని తనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. ఇదిలా ఉంటే… ఫిల్మ్ స్టార్స్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఒక్కొక్కరికీ ఒక్కోటి ఉంటుంది. అయితే తాను మాత్రం మూడు ప్రదేశాలలో ఎక్కువ గడపటానికి ఇష్టపడతానని శిరీష్ చెబుతున్నాడు. ఒకటి కాఫీ షాప్, రెండోది బుక్ స్టోర్స్ కాగా, మూడోది తన ఇంట్లోని గార్డెన్ అట! మొదటి రెండింటి సంగతి ఎలా ఉన్నా… ఇంట్లోని గార్డెన్ అనేది ఇప్పటి రోజుల్లో సేఫెస్ట్ ప్లేస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు!!