సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీని ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో మహేష్ ‘రా’ ఏజెంట్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ ఆసక్తికర టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘పార్థు’ అనే టైటిల్ ను ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28 టైటిల్‌గా ఖరారు చేయాలని భావిస్తున్నారట. మహేష్ బాబుకు కూడా ఈ టైటిల్ నచ్చిందట. కానీ ఇంకా టైటిల్ పై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అతడు’లో మహేష్ క్యారెక్టర్ పేరు ‘పార్థు’ కావడం విశేషం. ఇక 2005లో ‘అతడు’, 2010లో ‘ఖలేజా’ చిత్రాలను మహేశ్ హీరోగా తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ 11 సంవత్సరాల తర్వాత మరోసారి మహేశ్ తో మూవీ చేయబోతున్నాడు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ దీనిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సంస్థలో మహేశ్ బాబు నటించడం ఇదే తొలిసారి. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు మేకర్స్. వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.