Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కేటాయింపులపై రచ్చ రాజుకుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా 25 మాత్రమేనని యంత్రాంగం తేల్చి చెప్పేసింది. దీంతో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. అధికారుల వైఖరికి నిరసనగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు టిక్కెట్లు తీసుకోవడానికి నిరాకరించినట్టు సమాచారం. అటు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం టిక్కెట్ల పంచాయితీలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అలవాటైన విధానాలకు భిన్నంగా కొందరు ప్రజాప్రతినిధులకు ఎక్కువ టిక్కెట్లు కేటాయించి సిటీలో ఎమ్మెల్యేలను పట్టించుకోలేదనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ఈ ఏడాది సింహాచలం చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి పర్య వేక్షణ బాధ్యతలు అప్పగించింది. అయితే, గత ఐదేళ్ల మాదిరిగానే ఈసారి ఉత్సవ టిక్కెట్లపై రచ్చ తప్పలేదు. 70 శాతం ఆన్ లైన్ విధానంలో విక్రయిస్తామని చెప్పగా బ్యాంకులు దగ్గర భక్తులు పడిగాపులు పడాల్సి వచ్చింది. 300 రూపాయల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కొంత మేర లభించగా… వెయ్యి, 1500 స్లాట్లు మాత్రం అర కొరగానే పంపిణీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చందనోత్సవం టిక్కెట్ల వ్యవహారం హాట్ హాట్ గా మారింది. రేపు అర్ధరాత్రి నుంచి ఉత్సవం ప్రారంభం కానుండగా ఎల్లుండి స్వా మివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?