ఎంఎస్ రాజు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతునన్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి […]
తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ గెలుపొందారు. ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ పట్టం కట్టారు సినీ కార్మికులు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా […]
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవలే కోవిడ్ -19 బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్-3’ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సిన ముందురోజే ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు కోవిడ్ -19కు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు కరోనా సోకిన తర్వాత ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా వివరిస్తున్నాడు. కాగా […]
విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ “కొత్తగా రెక్కలొచ్చేనా”. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా… రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని “మనసా నిన్నలా లేదే” లిరికల్ వీడియో సాంగ్ ప్రముఖ సింగర్ సునీత విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్ కు గోపీచంద్ లగడపాటి లిరిక్స్ […]
అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ బ్యానర్ లపై అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నఖశిఖముని’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.రామ్ […]
నేడు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ వారికి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాతృదినోత్సవం సందర్భంగా వారి తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం […]
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మాగ్నమ్ఓపస్ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహామ్’. అభిమానులు చాలా కాలంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి మొట్ట మొదటి క్యారక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పురాణ చారిత్రక చిత్రం నుంచి రిలీజైన కీర్తి సురేశ్ లుక్ వైరల్ అవుతోంది. అందులో కీర్తి సురేష్ మలయాళీ స్టైల్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటోంది. శాస్త్రీయ సంగీతకళాకారణి ఆర్చా పాత్ర కోసం కీర్తి వీణ కూడా […]
ఈ ఏడాది ‘సుల్తాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ. అయితే తెలుగునాట ‘సుల్తాన్’ కి ఆదరణ దక్కలేదు. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కార్తీ ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లోనూ, పి.యస్. మిత్రన్ తో ‘సర్దార్’ సినిమాలోనూ నటిస్తున్నాడు. తాజాగా ‘సర్దార్’లో కార్తీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. పూర్తి గడ్డంతో రఫ్ గా కనిపించే కార్తీ లుక్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పాలి. ఈ సినిమా […]
ఎంతో ప్రతిభ ఉన్న నటి సాయిపల్లవి పుట్టినరోజు మే 9న. జన్మదిన సందర్భంగా ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే మరో సినిమా ‘విరాటపర్వం’ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిజానికి ఈ సినిమా గత నెలలోనే విడుదల కావలసి ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ […]
ఇటీవల ఎన్నికల్లో తమ పార్టీ డి.ఎం.కెను విజయపథంలో నడిపి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను, ఎమ్మెల్లేగా గెలిచిన స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ ను నటులు విశాల్, అమర్ అభినందించారు. రాష్ట్ర సంక్షేమంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూత నివ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది.