ఎంఎస్ రాజు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 (సోమవారం) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతునన్ న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. దీనికి నిర్మాతలుగా సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం సమర్థ్ గొల్లపూడి అందిస్తున్నారు. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్. గోవా, మంగుళూరు, అండమాన్ నికోబర్ దీవుల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. కాగా ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు చిరునామా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్. ఆ బ్యానర్ అధినేత ఎంఎస్ రాజు. నిర్మాతగానూ, దర్శకుడిగానూ రాణిస్తున్నారు ఎంఎస్ రాజు.