నేడు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ తల్లులతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ వారికి ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాతృదినోత్సవం సందర్భంగా వారి తల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్ద చేసింది. ఆ పుణ్యాత్మురాలికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు” అంటూ తన తల్లితో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నారు మోహన్ బాబు. ఇక చిరంజీవి, వరుణ్ తేజ్ లతో పలువురు ప్రముఖులు ‘మదర్స్ డే’ రోజున తమ తల్లులకు సోషల్ మీడియా వేదికగా మాతృదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.