మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మాగ్నమ్ఓపస్ చిత్రం ‘మరక్కర్: అరబికడలింటే సింహామ్’. అభిమానులు చాలా కాలంగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి మొట్ట మొదటి క్యారక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పురాణ చారిత్రక చిత్రం నుంచి రిలీజైన కీర్తి సురేశ్ లుక్ వైరల్ అవుతోంది. అందులో కీర్తి సురేష్ మలయాళీ స్టైల్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటోంది. శాస్త్రీయ సంగీతకళాకారణి ఆర్చా పాత్ర కోసం కీర్తి వీణ కూడా నేర్చుకుందట. పోర్చుగీస్ వారి దండయాత్రకు వ్యతిరేకంగా మలబార్ తీరాన్ని రక్షించడానికి నావికాదళ కమాండర్ కుంజలి మరక్కర్ ఏం చేశాడన్నది ఈ సినిమా కథాంశం. దీనికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంజు వారియర్, సునీల్ శెట్టి, అర్జున్ సర్జా, సుహాసిని, నేడుముడి వేణు, ఇన్నోసెంట్, ముఖేష్, ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణి ప్రియదర్శన్ ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న మలయాళ చిత్రం ఇది. ఇప్పటి వరకు అత్యంత భారీ బడ్జెట్ మలయాళ సినిమాగా రూపొందుతున్న ‘మరక్కార్’ ఈఏడాది ఆగస్టు 12 న థియేటర్లలో విడుదలకు సన్నద్దం అవుతోంది.