నాగచైతన్యతో విడిపోయాక సమంత ఫుల్ బిజీ అయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఎండార్స్ మెంట్స్. ఇక సినిమాలలో నటించటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో సమంత బికినీ తో దిగిన చిత్తరువును పోస్ట్ చేసింది. ఆ బికినీ బర్బెర్రీ బ్రాండ్ ది. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత ఒక్కో పోస్ట్ కి భారీగానే వసూలు చేస్తుంది. గతంలోనూ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ కోసం బ్రా, ప్యాంట్ పోజు ఇచ్చి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతానికి వస్తే సమంత ధరించిన బర్బెర్రీ బికినీ ధర $400.
అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 30వేలు. అయితే తను ధరించిన ఆ బికినీ తన ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేయడానికి సమంత దాదాపు కోటి రూపాయల వరకూ వసూలు చేయటం విశేషం. సోషల్ మీడియాలో తనకు ఉన్న క్రేజ్ వల్ల సమంత ప్రతి నెలా 3-4 బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ వాటి గురించి కథనాలు పోస్ట్ చేస్తూ వస్తోంది. దీనివల్ల సామ్ అదనంగా కోటి నుంచి రెండు, మూడు కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇక కొన్ని బ్రాండ్స్ కోసం తన టీమ్ తోనే కాన్సెప్ట్ తయారు చేసి వీడియో షూట్స్ కూడా జరుపుతూ ఉంటుంది. వాటికి వసూలు చేసేది కూడా ఎక్కువే. మనకున్న స్టార్ హీరోయిన్లలో సమంత బ్రాండ్ ఇమేజ్ పెద్ద మొత్తమే సుమా…!