Nia Tripathi:చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా నటన మీద ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినీ వారసుల సంగతి పక్కన పెడితే, సాధారణ కుటుంబాల్లోని వారూ ఫిల్మ్ ఇండస్ట్రీని చూజ్ చేసుకుంటున్నారు. అలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేసి, ఆపైన బెంగళూరులో ఎంబీఏలో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకుని చివరకు మోడల్ కమ్ యాక్టర్ గా సెటిల్ అయ్యింది నియా త్రిపాఠి. మధ్యప్రదేశ్ కు చెందిన నియా మోడలింగ్…
Satyadev 26: వెర్సటైల్ హీరో సత్యదేవ్ 26వ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Kireeti Reddy: ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను నిర్మిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ ని విడుదల చేశారు.
Masooda:'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మూడో చిత్రంగా 'మసూద'ను తెరకెక్కిస్తోంది. ఈ సంస్థ నుండి వచ్చిన తొలి చిత్రం 'మళ్ళీ రావా' లవ్ స్టోరీ కాగా, రెండో సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు 'మసూద'ను హారర్ డ్రామాగా రూపొందిస్తోంది. ఈ మూవీ గురించి నిర్మాత నక్కా రాహుల్ యాదవ్ మాట్లాడుతూ,