బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయం అయిన సినిమా 'స్వాతిముత్యం'. ఈ నెల 5న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దాంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో ప్రదర్శించాలని ఆహా సంస్థ భావించింది.
Allu Aravind: కన్నడలో సెప్టెంబర్ నెలాఖరులో రిలీజైన 'కాంతార' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న విడుదలై, ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.
దసరా కానుకగా ఈ నెల 5న విడుదలైంది 'స్వాతిముత్యం' సినిమా! చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' తో పోటీపడిన 'స్వాతిముత్యం'కు కంటెంట్ పరంగా మంచి పేరే వచ్చింది.
'స్వాతిముత్యం' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా... గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.
జాతీయ ఉత్తమనటి ప్రియమణి ప్రస్తుతం 'డాక్టర్ 56' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా, రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు.
మాక్ సూసైడ్ అనేది కొన్నేళ్ళుగా మన సమాజంలో ఎక్కడో అక్కడ జరుగుతున్నదే! కుటుంబ సభ్యులంతా కలిసి మాస్ హిస్టీరియాకు గురైనట్టుగా, ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడటమో, లేదంటే కుటుంబంలోని ఓ వ్యక్తి ప్రభావానికి లోనై ఆత్మహత్యకు ప్రేరేపితులు కావడమో జరుగుతోంది.
దీపావళి పండగ ఈ యేడాది అక్టోబర్ 24 అని కొందరు 25 అని మరికొందరు చెబుతున్నారు. అయితే తెలుగు సినిమా ప్రేక్షకులకు దీపావళి ఓ నాలుగు రోజుల ముందే సినిమాల రూపంలో వచ్చేస్తోంది.
Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది. బాలకృష్ణ సమకాలీనులైన సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ షో ఫస్ట్ సీజన్లో పాల్గొనలేదు. దాంతో ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు […]