Bellamkonda Ganesh: ‘స్వాతిముత్యం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేశ్ కు చక్కని గుర్తింపు లభించింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కాకపోయినా… గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. మరీ ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో గణేశ్ చక్కగా సెట్ అయ్యాడని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఇదే ఊపుతో అదే తరహాలో మరో కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో బెల్లంకొండ గణేశ్ నటిస్తున్నాడు. ‘నేను స్టూడెంట్ సార్’ పేరుతో ఈ సినిమాను ‘నాంది’ చిత్ర నిర్మాత సతీశ్ వర్మ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో రాఖీ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కంటెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించాడు.
Read also: Hebah Patel: నవంబర్ లో ‘తెలిసిన వాళ్ళు’ రాబోతున్నారు!
గత కొద్ది రోజులుగా చిత్ర బృందం పోస్టర్ల ద్వారా ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ముందుగా కథానాయకుడు గణేష్, కథానాయిక అవంతిక దాసాని ఫస్ట్ లుక్స్ ని ఆవిష్కరించారు. ఈ చిత్రంలో అర్జున్ వాసుదేవన్‌గా నటిస్తున్న సముద్ర ఖని ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. పాత్ర పేరు సూచించినట్లుగా, సముద్ర ఖని హీరోయిన్ అవంతిక తండ్రిగా కనిపించనున్నారు. అవంతిక పాత్ర పేరు శృతి వాసుదేవన్ గా ఇదివరకే పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సముద్ర ఖని సీరియస్ గా నడిచి వస్తున్న పోలీసు అధికారిగా కనిపించారు. సముద్ర ఖని వెనుక పెద్ద సంఖ్యలో విద్యార్ధుల సమూహాన్ని కూడా గమనించవచ్చు. ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Dr. 56 ప్రియమణి మూవీ పోస్టర్ ను ఆవిష్కరించిన మక్కల్ సెల్వన్!