Yashoda movie: సమంత పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఖరారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Pan India Film Yashoda Release Date Fix: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ మీదనే దృష్టి పెట్టింది. ఆమె నటిస్తున్న ‘శాకుంతలం, యశోద, ఖుషీ’ సినిమాలు మూడూ వివిధ భారతీయ భాషల్లో ఒకే రోజున విడుదల కానున్నాయి. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలు అనివార్య కారణంగా వాయిదా పడ్డాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ‘యశోద’ను వాయిదా వేసినట్టు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుపగా, త్రీడీ వర్షన్ లో ‘శాకుంతలం’ను కన్వర్ట్ చేస్తున్నందున వాయిదా వేసినట్టు ఆ చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్ తెలిపారు. దాంతో డిసెంబర్ చివరి వారంలో రావాల్సిన ‘ఖుషీ’ సినిమా విడుదల తేదీ సైతం వాయిదా పడవచ్చుననిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. సమంత ‘యశోద’ మూవీ రిలీజ్ డేట్ ను సోమవారం ఆ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రకటించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవంబర్ 11న ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కథ, కథనం, నిర్మాణ విలువల్లోనే కాక చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా రొటీన్ కి భిన్నంగా వెళుతున్న చిత్ర టీం, విడుదల తేదీ పోస్టర్ ని వినూత్నంగా అభిమానులు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. సాధారణంగా థ్రిల్లర్ అంటే మిస్టరీ అనుకుంటారు. కానీ, ఇందులో హ్యుమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలూ ఉన్నాయి. వినూత్నమైన కథతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ‘యశోద’. టైటిల్ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల కోసం ట్రైనింగ్ తీసుకుని, చాలా ఎఫర్ట్స్ పెట్టి క్యారెక్టర్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త డైమెన్షన్‌లో ఉంటుంది. ఈ వారంలో సెన్సార్ పూర్తవుతుంది. సాంకేతికంగా ఎక్కడా రాజీ పడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. కొత్త కంటెంట్ కావాలని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, కథనం ‘యశోద’లో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు” అని అన్నారు.
Also Read
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!