Manjula Ghattamaneni: ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పెళ్ళిరోజు. ఇందిరాదేవి మెడలో మూడు ముళ్ళు వేసి, ఏడు అడుగులు నడిచిన రోజు. ఇవాళ వీరిద్దరూ మన మధ్య సజీవంగా లేరు. ఇందిరాదేవి మరణించిన కొన్ని మాసాలకే కృష్ణ సైతం కన్నుమూశారు. ఇవాళ వారి వివాహ దినోత్సవం సందర్భంగా తన తల్లిదండ్రులను మరోసారి కుమార్తె మంజుల గుర్తు చేసుకున్నారు. వారి జీవిత భాగస్వామ్యం ఇప్పుడు స్వర్గంలోనూ కొనసాగుతోందని మంజుల అభిప్రాయపడ్డారు. తన తల్లి చనిపోయిన తర్వాత ఆ లోటును తండ్రి కృష్ణ ఎక్కువగా భావించే వారని, బహుశా అందుకే ఆమెను కలవడానికే ఆయన ఇంత త్వరగా తమను వదిలి స్వర్గానికి వెళ్ళి ఉంటారని తాను భావిస్తున్నానని మంజుల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. వారిద్దరితో పాటు తానున్న ఫోటోలను ట్వీట్ చేస్తూ, తల్లిదండ్రులకు మంజుల వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Their special marriage is a great partnership which continued even in Heaven. After mom left, dad was missing her a lot.I think he missed mom so much that he left us to join her. They are indeed each other's soul mates.
Happy wedding anniversary mom and dad ❤ pic.twitter.com/9TPhEXMkxM
— Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 22, 2022