Power Star: బాస్ పార్టీ సాంగ్ చూసేసిన పవన్ కళ్యాణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా ఇందులోని బాస్ పార్టీ సాంగ్ ను రేపు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి ఎ.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్ మాత్రమే కాదు ప్రొడక్షన్ డిజైనర్ కూడా. ఈ పాట కోసం ఆయన వేసిన సెట్ ను ప్రత్యేకంగా చిరంజీవి అభినందిస్తూ, ట్వీట్ కూడా చేశారు. ఇదిలా ఉంటే… తాజాగా బాస్ పార్టీ సాంగ్ ను చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వీక్షించారు. ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ స్పాట్ కు తన ‘హరిహర వీరమల్లు’ చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఎ.ఎం. రత్నంతో కలిసి వెళ్ళారు. ఈ పాటను దర్శకుడు బాబీ పవర్ కళ్యాణ్ కు చూపించారు. ఆయనకు ఈ పాట ఎంతో నచ్చిందని, తనను అభినందించారని బాబీ ఈ సందర్భంగా తెలిపారు. విశేషం ఏమంటే… ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా చిరంజీవితో కాలు కదిపింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే ఈ పాటను రాయడం విశేషం. దీనిని నకాశ్ అజీజ్, హరిప్రియా పాడారు. మాస్ మహరాజా రవితేజ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్ గా నటించింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది. నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. జి.కె. మోహన్ ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
A Huge moment to be Cherished forever 🥳
My 2 Most favorite persons Megastar @KChiruTweets garu & Power Star @PawanKalyan garu by my side 🤩Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
Kalyan garu has seen #BossParty song & he loved it.,Such a Positive person with same love even after all these years. ❤️#WaltairVeerayya pic.twitter.com/K2h9Z0JryL
— Bobby (@dirbobby) November 22, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!