Suryadevara Nagavamsi: వరుస విజయాలతో టాలీవుడ్ లో దుసుకుపోతున్న సంస్థల్లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఒకటి. ఇప్పుడీ సంస్థ ‘ఇంటింటి రామాయణం’ మూవీతో ఓటీటీలోకీ అడుగుపెడుతోంది. నరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేశ్ నారెడ్ల డైరెక్ట్ చేశారు.
ఈ మూవీ గురించి సూర్యదేవర నాగవంశీ చెబుతూ, ”కరీం నగర్ లో నివసించే రాములు కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. అక్కడి నుండి కుటుంబ సభ్యులలోనే ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. దీంతో వారిలో దాగున్న అసలు రూపాలు బహిర్గతం అవుతాయి. వీటన్నింటినీ దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించాడు. మానవ సంబంధాలు ఏ ఏ సమయాల్లో ఎలా మారిపోతాయో తెలిపే సినిమా ఇది. వ్యక్తుల ప్రవర్తనకు సంబంధించిన ఈ గుణపాఠాలు చాలా కాలం వ్యూవర్స్ కు గుర్తుండి పోతాయి” అని అన్నారు. ‘ఇంటింటి రామాయణం’ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. మూవీ టీజర్ ను ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నారు. ఆహాలో ఈ సినిమా డిసెంబర్ 16న స్ట్రీమింగ్ కానుంది.