Hanuman: పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా: ప్రశాంత్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘హను-మాన్’ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జా పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. అది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. సోమవారం ఊహాతీతమైన కంటెంట్ తో ‘హను-మాన్’ టీజర్ విడులైంది. 121 సెకన్ల ఈ టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, ”హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలను జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మన దగ్గర ఎవరున్నారు. సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్, సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలలో ఇంతవరకూ మనం చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తి పొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా ‘హను -మాన్’. ఇంత గొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారికి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయనతో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. ఈ సినిమా కూడా అంతే వినయంగా, నిజాయితీతో చేశాం. ఇది ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నాలుగు సినిమాల కష్టం దీని కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్నాను” అని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ”నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. మా నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. ‘హను – మాన్’ కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్, సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హనుమాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఏదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటిసారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హనుమాన్ మీద ఈ సినిమా చేస్తున్నాం. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే ‘అధీర’ అనే మరో సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. ‘హను-మాన్’ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి ‘జాంబీ రెడ్డి’ చేశాం. ‘హను-మాన్’కి తేజనే ఎందుకు తీసుకున్నావని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్ డాగ్ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ ఆలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి.. అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమాలు ‘ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2’ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ వెళుతున్నాయి. ‘హను – మాన్’ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం” అని అన్నారు. హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ, ”టీజర్ అద్భుతమనిపించింది. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తేజ సజ్జా మీ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది” అన్నారు. ఈ వేడుకలో శ్రీనాగేంద్ర తంగాల, శివేంద్ర, గౌరా హరి, గెటప్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు.
Also Read
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!