Suhas: ఆనందరావ్ చేసిన అడ్వంచర్స్ ఏమిటీ!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anandrao Adventures: సుహాస్ హీరోగా రామ్ పసుపులేటి దర్శకత్వంలో జాపీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘ఆనందరావ్ అడ్వంచర్స్’ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం టైటిల్ తో పాటు ఫస్ట్-లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, ఆనంద్ దేవరకొండ, క్రిష్, నందిని రెడ్డి, బివిఎస్ రవి తదితరులు హాజరయ్యారు. ఈ ఫెయిరీ టేల్ ఫాంటసీ చిత్రాన్ని జూపీ స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 4గా నిర్మించబోతోంది. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నె, సురేష్ కొత్తింటి దీనికి నిర్మాతలు. సుహాసిని రాహుల్, మురళీ జంపన సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ, ”త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఐదేళ్ళుగా ఈ దర్శకుడు తెలుసు. ఆయన చెప్పిన 7వ కథ ఇప్పుడు వెండితెరకు ఎక్కబోతోంది. పోస్టర్ లోనే కంటెంట్ తెలిసిపోతోంది. నాతో ఈ చిత్రాన్ని తీస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు” అని అన్నారు. సహ నిర్మాత సుహాసిని మాట్లాడుతూ, ”మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాం. మాకు స్పూర్తి అయిన రానా గారు వచ్చి ఆశీస్సులు అందించడం ఆనందంగా వుంది” అని చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన రామ్ పసుపులేటి మాట్లాడుతూ, ”చిల్డ్రన్ ఫాంటసీ కథ తో ఇది తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తాం” అని అన్నారు. ఈ సినిమాకు మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూర్చుతుండగా, రాకేష్ ఎస్ నారాయణ్ సినిమాటోగ్రఫీని అందించబోతున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!