Anikha Surendran: కలర్ ఫుల్ గా ‘బుట్టబొమ్మ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Butta Bomma’:ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బుట్ట బొమ్మ’ చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల 26న మూవీ జనం ముందుకు రాబోతున్న సందర్భంగా కథానాయిక అనిక సురేంద్రన్ మీడియాలో ముచ్చటించింది.
‘బుట్టబొమ్మ’లో అవకాశం రావడం గురించి అనిక మాట్లాడుతూ, ”బాలనటిగా ఎన్నో ఏళ్లుగా పలు చిత్రాలలో నటించాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ‘కప్పేలా’ మలయాళ వెర్షన్ చూశాను. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది. అందుకే ఏ మాత్రం ఆలోచింకుండా వెంటనే అంగీకరించాను. పైగా దీనిని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి సంస్థ నిర్మించడంతో మరో ఆలోచన ఏదీ చేయలేదు” అని తెలిపింది.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
మలయాళ మాతృక కంటే ‘బుట్టబొమ్మ’ బాగుంటుందని చెబుతూ, ”మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా, ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నేను మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ సపోర్ట్ తో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను. నిజానికి తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ను వివరించి నా నుండి చక్కని నటన రాబట్టుకున్నారు” అని చెప్పింది.
తెలుగులో మొదటి సినిమానే సితార సంస్థలో చేయడం హ్యాపీగా అనిపించిందని, ఈ మూవీ రిలీజ్ కాకుండానే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయని, ఇక్కడ కూడా మంచి స్క్రిప్ట్ వస్తే తాను నటించడానికి సిద్ధమని అనికా చెప్పింది. ప్రస్తుతం మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలోనూ ఓ మూవీ చేస్తోంది.
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..