Hunt: నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ‘హంట్’. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తమ చిత్రం ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందిందని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే… భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్న ఈ మూవీని ఇదే నెల 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ‘హంట్’ మూవీ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ మూవీ గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, ”అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. వాళ్ళు యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర ఆదివారం హైదరాబాద్ ఎ.ఎం.బి. మాటలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అభిమానులను ఆహ్వానిస్తున్నాం” అని తెలిపారు.
ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, చిత్రాశుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.