Popcorn: అవికా గోర్ ను చూడగానే ‘మది విహంగమయ్యే’నట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avika Gor: అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం. ఎస్. చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్తా (”నెపోలియన్, మా ఊరి పొలిమేర” చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించటం విశేషం. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బుధవారం రోజున ‘మది విహంగమయ్యే…’ అనే లిరికల్ సాంగ్‌ను హీరో నాగ చైతన్య విడుదల చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ పాటను గమనిస్తే ఓ షాపింగ్ మాల్‌లోనే పాటంతా సాగుతుంది. హీరో హీరోయిన్లు అందులో షాపింగ్ చేయటానికి వచ్చినప్పుడు వారి ఆలోచనలు.. ఎంత వేగంగా వారి భవిష్యత్తు వైపు అందంగా దూసుకెళ్తున్నాయనే విషయాన్ని రచయిత శ్రీజో చక్కటి సాహిత్యంతో పొందుపరిచారు. శ్రవణ్ భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాటను బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా చక్కగా ఆలపించారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం. ఎస్. చలపతి రాజు మాట్లాడుతూ ”ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. సినిమా అంతా షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులోనే ఉంటుంది. పెద్దలకు వారి యంగ్ ఏజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పటి యువతకు కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ మురళి గంధం టేకింగ్‌ను అందరూ తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు” అని అన్నారు.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ ”ఇదో డిఫరెంట్ మూవీ . డైరెక్టర్ మురళిగారు నెరేషన్ వినగానే ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాను. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న ‘పాప్ కార్న్’తో సందడి చేయబోతున్నాం” అన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ ”సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఇక చివరి 45 నిమిషాలైతే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మూవీ అలరిస్తుంది” అని చెప్పారు. ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!