పదేళ్ళ విరామం తర్వాత 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇవాళ ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా జీ స్టూడియోస్ ఈ ప్రకటన చేసింది.
టాలీవుడ్ లో కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్న వేణు, అభయ్ ఇద్దరూ దర్శకులుగా మారారు. వేణు 'బలగం' పేరుతోనూ, అభయ్ 'రామన్న యూత్ ' పేరుతోనూ సినిమాలు రూపొందిస్తున్నారు.
రక్షిత్ అట్లూరి ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ఆపరేషన్ రావణ్'. ఈ సినిమాలో రాధిక ఓ కీలక పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను మంగళవారం రివీల్ చేశారు.
వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అగ్ని నక్షత్రం' మూవీ గ్లిమ్స్ విడుదలైంది. మంచు లక్ష్మీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ మూవీలో మోహన్ బాబు ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రను పోషిస్తున్నారు.
'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' చిత్రంలో లవ్ ఆంథమ్ ఈ రోజు విడుదలైంది. రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాతో రాజేశ్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
జనసంఘ్ నేత, ఏకాత్మ మానవతా వాద సిద్ధాంత కర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ బయోపిక్ హిందీలో తెరకెక్కుతోంది. 'మై దీనదయాళ్ హూ' అనే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్నుకపూర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా బన్నీ వాసు నిర్మించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా అన్నమాచార్య వారసులను చిత్రబృందం సత్కరించింది.
'భీమ్లానాయక్', 'బింబిసార' చిత్రాలతో వరస విజయాలను అందుకున్న సంయుక్త మీనన్ ఇప్పుడు ద్విభాషా చిత్రం 'సార్'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలోని లెక్చరర్ పాత్ర తనకు నటిగా చక్కని గుర్తింపు తెచ్చిపెడుతుందని సంయుక్త ఆశాభావం వ్యక్తం చేస్తోంది.