Krishna Gadu Ante Oka Range: తెలుగు చిత్ర సీమలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు కొదవే లేదు. అయితే యూత్ ఆడియన్స్ మెచ్చే కథాకథనం ఉంటేనే ఆ సినిమాలు విజయం సాధిస్తుంటాయి. సరిగ్గా అదే ఫార్ములాతో వస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు రాజేశ్ దొండపాటి చెబుతున్నారు. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై. లి బ్యానర్ పై రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ జంటగా పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘లవ్ ఆంథెమ్ ఆఫ్ 2023’ పేరుతో ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘చూడు చూడు చూడమంటూ గుండె…’ అంటూ సాగే ఈ పాటను వరికుప్పల యాదగిరి రాయగా, యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి సుమధురంగా ఆలపించారు. లిరిక్స్ కి తగ్గ విజువల్స్ జోడించి ఈ సాంగ్ రూపొందించిన విధానం యూత్ ఆడియన్స్ మెప్పు పొందేలా ఉంది. నిజమైన ప్రేమికుల ఫీలింగ్స్ చెబుతూ పల్లెటూరి వాతావరణంలో షూట్ చేసిన ప్రతి సీన్ కూడా పాటలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. సాబు వర్గీస్ బాణీలు ఈ సాంగ్ లో మేజర్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు చూడు చూడు లిరికల్ సాంగ్ ఆడియన్స్ దృష్టిని సినిమా వైపు మళ్లించింది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయిబాబు తలారి పని చేస్తున్నారు. ఎస్ కే రఫి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.