Meera Jasmine: రీ-ఎంట్రీలో ‘విమానం’ ఎక్కుతున్న అందాల భామ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vimanam: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘అమ్మాయి బాగుంది’ అంటూ అందరితో అనిపించుకుంది మీరా జాస్మిన్. ఆ తర్వాత బాలకృష్ణ, పవర్ కళ్యాణ్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చోటు దక్కించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ కు ప్రాధాన్యమిచ్చిన మీరా జాస్మిన్ టాలీవుడ్ కు దూరమై దాదాపు దశాబ్దం అయిపోయింది. అయితే గత కొంత కాలంగా తన రీ-ఎంట్రీ గురించి హింట్స్ ఇస్తూ ఉంది. గ్లామరస్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సినిమారంగంలోని దర్శక నిర్మాతలకు తాను గ్లామర్ షోకూ రెడీ అని చెప్పకనే చెప్పింది. మొత్తానికి అమ్మడి పథకాలు ఫలించాయని తెలుస్తోంది. ఇవాళ మీరా జాస్మిన్ 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె ‘విమానం’ అనే సినిమాతో రీ-ఎంట్రీ చేస్తున్నట్టు జీ స్టూడియోస్ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఆమె నాయికగా కె.కె. క్రియేటివ్ వర్క్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయబోతున్నట్టు తెలిపింది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన సమాచారం ప్రకటించాల్సి ఉంది. మాధవన్ ‘రన్’ మూవీతో తమిళంలోనూ మీరా జాస్మిన్ కు లక్షలాది అభిమానులు ఏర్పడ్డారు. అదే సమయంలో ఇటు తెలుగులోనూ ‘గుడుంబా శంకర్, భద్ర’ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. నటిగా జాతీయ అవార్డునూ సొంతం చేసుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడీ ‘విమానం’తో ఇంకే హద్దులకు విహరిస్తుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!