MLC Kasireddy: బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు
MLA Seethakka: విధి లేని పరిస్థితిలోనే కోర్టును ఆశ్రయించా కోర్టులోనైనా నాకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. ములుగు ఫై బీఆర్ఎస్ వివక్ష చూపిస్తుందని మండిపడ్డారు.
ఏపీలో స్కూల్స్, కాలేజీలకు జగన్ సర్కార్ దసరా సెలవులను ఖరారు చేసింది. ఏపీలో 13 రోజులు సెలవులు ఇచ్చాయి. అక్టోబరు 13వ తారీఖు నుంచి దసరా సెలవులను ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ 25 వరకు ఈ సెలవులు ఉంటాయి.
Lakefront Park: చారిత్రక హుస్సేన్‌సాగర్ రిజర్వాయర్ ఒడ్డున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మించిన లేక్ ఫ్రంట్ పార్క్ ఆదివారం నుంచి సందర్శకులకు అందుబాటులోకి వస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Modi Posters: నిజామాబాద్ జిల్లాలో మంచిప్పలో పోస్టర్ల కలకలం సృష్టించాయి. మోడీ పర్యటన నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఓట్ల కోసం మా ఇళ్ల కు రావొద్దంటు మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు ప్రతి ఇంటికి పోస్టర్లు అతికించుకున్నారు.
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రేపు ( అక్టోబర్ 2 ) నారా భువనేశ్వరి నిరహార దీక్షకు దిగుతున్నారు. ఇక, అదే రోజు జైల్లోనే చంద్రబాబు సైతం నిరాహార దీక్ష చేయనున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో 100 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్ను ఇవాళ (ఆదివారం) సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.