టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ కలిసి వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారు అంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 800 కోట్ల రూపాయల విలువైన పేదల భూములను దోచేశారు.. త్వరలోనే నారాయణ కూడా అరెస్టు అవుతారు.. అందుకే ఆయనకు భయం పట్టుకుంది..
Minister KTR: మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ, క్యాతంపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర నేటి (ఆదివారం) నుంచి కృష్ణా జిల్లాలో కొనసాగనుంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవినగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణా దేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జనసేన అధ్వర్యంలో బహిరంగ సభ జరుగనుంది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నేడు (ఆదివారం) రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
విశాఖపట్నం వేదికగా జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్ పోటీలు నేటి( ఆదివారం ) నుంచి విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
NTV Daily Astrology 1st Oct 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్‌కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా తన పర్యటనకు ముందు కాంగ్రెస్ , బీఆర్ఎస్లపై ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది.